రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్ల బాట కార్యక్రమం
1 min read

హొళగుంద న్యూస్ నేడు : మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు మరియు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ఆదేశాల మేరకు వైయస్సార్ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్ల బాట కార్యక్రమం మొదలైంది. నాలుగు రోజుల పాటు విస్తృతంగా జరిగే ఈ కార్యక్రమం లో 3వ రోజు ఆలురు నియోజకవర్గ వైయస్సార్ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు రాజు, విద్యార్థి విభాగం మండల అధ్యక్షుడు కొండా అమరేష్ ఆధ్వర్యంలో కార్యక్రమంలో నిర్వహించడం జరిగింది .హొళగుంద మండలం ఇంగళదహల్ గ్రామంలో ఉన్నటువంటి బాయ్స్ హాస్టల్ సందర్శించి అక్కడి సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసి . అనంతరం విద్యార్థులతో సమావేశమై అక్కడ వారు ఎదుర్కొంటున్న ఇక్కట్ల గురించి స్వయంగా వారినే అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ లో సరైన మౌలిక సదుపాయాలు లేవని ప్రధానంగా త్రాగునీరు లేవని బట్టలు ఉతకడానికి స్నానం చేయడానికి వాడుకోవడానికి ఉపయోగించే నీటినే పిల్లలు త్రాగుతున్నారని . దుప్పట్లు , నోట్ బుక్ లు, గ్లాసులు, , ట్రంక్ పెట్టే లను ఇంతవరకు కూడా పిల్లలకు ఇవ్వక పోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. హాస్టల్ కు నైట్ వాచ్మెన్ కూడా లేకపోవడం హాస్టల్ లో విద్యారుల సమస్యలను నోట్ చేసుకొని ఆగస్టు 1 వ తేదీ న కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని మీడియా మిత్రులకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వైయస్సార్ స్టూడెంట్ యూనియన్ తాలుకా అధ్యక్షుడు రాజు మరియు విద్యార్థి విభాగం మండల అధ్యక్షుడు కొండా అమరెష్, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే గిరి,ఎంపీటీసీ మల్లికార్జున, సర్పంచ్ వెంకట్ రెడ్డి, ప్రహ్లాద రెడ్డి, హొళగుంద మండల కో కన్వీనర్ లక్ష్మన్న,సాయి, మంజు, తిమ్మప్ప వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బివిఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

