NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సీఎంఆర్ఎఫ్  చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్యాం కుమార్

1 min read

పత్తికొండ, న్యూస్​ నేడు:  పత్తికొండ నియోజకవర్గంలో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న బాధితులకు స్థానిక ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ సీఎం రిలీఫ్ ఫండ్ కింద చెక్కులను పంపిణీ చేశారు.  పత్తికొండ  మండలం దూదేకొండ కు చెందిన అడ్వకేట్ చంద్రశేఖర్ నాయుడు కు   91,260 రూపాయలు,వెల్దుర్తి మండలం నరసాపురం చెందిన  ఈ.షణ్ముఖ కార్తీక్  కు 1,00858  రూపాయల  సీఎంఆర్ఎఫ్  చెక్కులను  పత్తికొండ లో  ఎమ్మెల్యే క్యాంప్కార్యాలయం లో బుధవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. చెక్కులు అందుకున్న వారు ఎమ్మెల్యే  కే.ఈ.శ్యామ్ కుమార్ ,కి ముఖ్యమంత్రి చంద్రబాబుకు  గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్  మాట్లాడుతూ, పేదవాళ్లు అనారోగ్యానికి గురైతే… ముఖ్యమంత్రి చంద్రబాబు అండగా నిలుస్తున్నారన్నారు. ఆరోగ్యశ్రీ వర్తించని వారికి కూడా సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం అందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి శ్రేణులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author