భర్తను సుపారీ ఇచ్చి హత్య చేయించిన భార్యతో పాటు నలుగురు అరెస్టు
1 min read
భార్యతో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్
అగిరిపల్లి మండలంలో సంచలనం రేపిన వ్యక్తి హత్య
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: అగిరిపల్లి మండలంలో సంచలనం రేపిన వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా మారిన భర్తను భార్యే సుపారీ ఇచ్చి హత్య చేయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో భార్యతో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఏలూరు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిశోర్ ఆదేశాల మేరకు, నూజివీడు డీఎస్పీ కెవివిఎన్ ప్రసాద్ పర్యవేక్షణలో అగిరిపల్లి పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. నూజివీడు రూరల్ సీఐ కె. రామకృష్ణ, అగిరిపల్లి ఎస్ఐ కె. శివకుమార్ సిబ్బందితో కలిసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం
వడ్లమాను గ్రామానికి చెందిన రెడ్డి సులోమన్ రాజు భార్య రెడ్డి దుర్గామణికి అదే ప్రాంతానికి చెందిన పలగాని వెంకన్నబాబుతో అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్తకు తెలిసి తరచూ భార్యను ప్రశ్నించడంతో పాటు, వారి సంబంధానికి అడ్డుగా నిలుస్తున్నాడు.దీంతో భర్తను తొలగించాలని నిర్ణయించిన దుర్గామణి, తన ప్రియుడు వెంకన్నబాబుతో కలిసి హత్యకు కుట్ర పన్నారు. ఇందుకోసం నాగ కిషోర్, జస్వంత్ రాయ్, కలతోటి మణికంఠలకు సుపారీ ఇచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.గత నెలలో సులోమన్ రాజును పథకం ప్రకారం హత్య చేసి, దాన్ని సహజ ఘటనలా చూపించే ప్రయత్నం చేసినట్లు దర్యాప్తులో తేలింది. అయితే పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది.
ఈ కేసులో1)కలతోటి సాయి శ్రీనివాస్, 2)మద్దాలి జస్వంత్ రాయ్,3)కలతోటి మణికంఠ,4)పలగాని వెంకన్నబాబు,5) రెడ్డి దుర్గామణి అనే ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.నిందితుల వద్ద నుంచి AP 40 JC 5757 నంబర్ గల కారు, ఐదు సెల్ఫోన్లు, ఖాళీ బ్యాగులు, రూ.75 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.


