మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి…
1 min read

లీ ఫార్మా,లీ డోమైన్ హెల్త్ అద్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం.
నాణ్యమైన ఆహారం తీసుకునేందుకు శ్రద్ద వహించాలి.
శారీరకంగా మహిళలు ధృడంగా ఉండేందుకు కృషి చేయాలి.
లీ ఫార్మా డైరెక్టర్ ఆళ్ళ లీలారాణి.
విశాఖపట్నం, న్యూస్ నేడు: మహిళలు అన్ని రంగాల్లో తమ ప్రతిభను చూపేందుకు కృషి చేయాలని,ప్రధానంగా మువతులు,మహిళలు నాణ్యమైన ఆహారం తీసుకోని,శరీరక ధృఢత్వాన్ని మెరుగు పర్చుకోవాలని లీ ఫార్మా లిమిటెడ్ డైరెక్టర్ ఆళ్ళ లీలారాణి పెర్కోన్నారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, లీ ఫార్మా లిమిటెడ్ మరియు లీ హెల్త్ డొమైన్ సంయుక్తంగా అగనంపూడి అంగన్‌వాడీ టీమ్ (విశాఖపట్నం జిల్లా) తో కలిసి అగనంపూడి CWC వద్ద వంటల పోటీని నిర్వహించాయి.ఈ కార్యక్రమంలో పోషకాహారం విలువలు,ప్రాధాన్యత అంశాలపై పోటీలు నిర్వహించారు.ఈ పోటీల్లో 25 మందికి పైగా మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. గర్భిణీలు మరియు బాలింతలకు ఎంతగానో ఉపయోగపడే ఐరన్ (ఇనుము) మరియు కాల్షియం పుష్కలంగా ఉన్న ఆహార పదార్థాలను వారు తయారుచేసి తీసుకువచ్చారు.ముఖ్య అతిథులువిశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆసుపత్రి గైనకాలజిస్ట్ డాక్టర్ సుజాత హాజరయ్యారు. ఆమె వంటకాలను రుచి చూసి విజేతలను ప్రకటించడమే కాకుండా, అక్కడి మహిళలకు విలువైన ఆరోగ్య సలహాలను,సూచనలను అందించారు.
ప్రత్యేక కార్యక్రమాలు: మిల్లెట్ రెసిపీ బుక్: చిరుధాన్యాలతో చేసే వంటకాల పుస్తకాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు.
నాటిక: మైక్రోగ్రీన్స్ (సూక్ష్మ ఆకుకూరలు) ప్రాముఖ్యతను వివరిస్తూ “చిన్న విత్తనం – పెద్ద బలం” అనే కాన్సెప్ట్‌తో ఒక చిన్న నాటికను ప్రదర్శించారు. మైక్రోగ్రీన్ కిట్ల పంపిణీ: అంగన్‌వాడీ టీచర్లకు మైక్రోగ్రీన్ కిట్లను పంపిణీ చేశారు.అనంతరం లీ ఫార్మా డైరెక్టర్ ఆళ్ళ లీలారాణి మాట్లాడుతూ మహిళలు అర్ధికంగా ఎదగడంతో పాటు,ఆరోగ్యానికి కాపాడుకున్నేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. నిత్మ పోషక విలువలతో ఉండే ఆహారం తీసుకోవడం మేలని అన్నారు.పాల్గొన్న ప్రముఖులుఈ కార్యక్రమంలో క్యాంప్ కోఆర్డినేటర్లు సరోజిని మరియు జయ, న్యూట్రిషనిస్ట్ మాధురి, క్రాంతి, GNM భాగ్యలత మరియు లీ ఫార్మా టీమ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


