NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భక్త కనకదాసు విగ్రహానికి గోరంట్ల మాధవ్ ప్రత్యేక పూజలు

1 min read

హోళగుందన్యూస్ నేడు : హోళగుంద మండలం హెబ్బటం  గ్రామంలో ప్రతిష్టించిన శ్రీ భక్త కనకదాసు విగ్రహాన్ని హిందూపురం మాజీ పార్లమెంట్ సభ్యులు గోరంట్ల మాధవ్ శనివారం సందర్శించి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కనకదాసు సమాజంలో సమానత్వం, భక్తి భావం, మానవత్వం వంటి విలువలను ప్రజలకు బోధించిన గొప్ప భక్త కవి అని గోరంట్ల మాధవ్ తెలిపారు.ఈ సందర్భంగా విగ్రహం వద్ద పూజలు నిర్వహించి గ్రామ ప్రజల సంక్షేమం, శాంతి సమృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. గ్రామంలో కనకదాసు విగ్రహ ప్రతిష్టాపన జరగడం గ్రామస్తులకు గర్వకారణమని, భవిష్యత్ తరాలకు ఆయన సందేశాలు మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్కే గిరి, గ్రామస్తులు ఆనంద్, గిరి, శీను, అయ్యాలప్ప, సందీప్, రంగస్వామి, శంభు లింగ, తదితరులు పాల్గొన్నారు. గ్రామ పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

About Author