పంపులు చెరువు లీకేజీ శాశ్వత పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన పనులు
1 min read
సంబంధిత అధికారులతో పరిశీలించిన కో-ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు
పటిష్టమైన చర్యలకు ఏర్పాట్లు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు పంపుల చెరువు లీకేజీ శాశ్వత పరిష్కార పనులను నగరపాలక సంస్థ కో-ఆప్షన్ సభ్యులు ఎస్ ఎం ఆర్ పెదబాబు,ఎంఈ సురేందర్ బాబుతో కలిసి సోమవారం పర్యవేక్షించారు.ఈ సందర్భంగా ఎస్ ఎం ఆర్ పెదబాబు మాట్లాడుతూ యుద్ధ ప్రాతిపదికన పంపుల చెరువు లీకేజీ శాశ్వత పరిష్కార పనులు జరుగుతున్నాయన్నారు.ఈరోజు ప్రత్యేకంగా లీకేజీ పనులు పరిశీలించడానికి ప్రధానమైన కారణం ఎస్ ఎం ఆర్ పెదబాబు వివరించారు.బాండ్ పటిష్టపరిచే చర్యల్లో భాగంగా బాండ్ కట్ చేస్తుండగా మున్సిపల్ అధికారులు ఎక్కడైతే లీకేజీ ఏర్పడిందని గతంలో గుర్తించారో అదే ప్రాంతంలో 12.5 మీటర్ల లోతులో రెండు మీటర్ల వెడల్పులో బాండ్ కు గాడిపడి లీకేజీ ఏర్పడినట్టు గుర్తించామన్నారు. లీకేజీ ఏర్పడిన ప్రదేశాన్ని గుర్తించడం వలన మిగతా పనులు శరవేగంగా జరుగుతాయన్నారు.గతంలో అధికారులు ఇచ్చిన ప్లాన్ ప్రకారమే లీకేజీ శాశ్వత పరిష్కార పనులను కొనసాగిస్తామని ఎస్ ఎం ఆర్ పెదబాబు ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎంఈ సురేంద్రబాబు,ఎలక్ట్రికల్ డి.ఈ నారాయణ,ఏఈలు సాయి,పవన్ కార్పొరేటర్లు దేవరకొండ శ్రీనివాసరావు,పాము శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు.

