NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  ” ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం” జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు అధ్యక్షులు జి. కబర్థి, కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి సూచనల మేరకు  ప్రపంచ ఆహార భద్రత దినోత్సవాన్ని పురస్కరించుకొని  జిల్లా న్యాయ సేవాధికారిక సంస్థ ఆధ్వర్యంలో  న్యాయ సేవాధికారిక సంస్థ సమావేశ భవనంలో  జరిగిన అవగాహన కార్యక్రమంలో  శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకట హరినాథ్ మాట్లాడుతూ ఆహారం సురక్షితంగా ఉండటం ప్రతి మనిషి ఆరోగ్యానికి అత్యంత అవసరం అని,కలుషిత ఆహారం అనేక రకాల వ్యాధులకు కారణమవుతుందనిఆహార తయారీ, నిల్వ, రవాణా మరియు విక్రయంలో పరిశుభ్రత పాటించాలని,ప్రతి వ్యక్తి ఆహార భద్రతా ప్రమాణాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్  శివరామకృష్ణ రావు మాట్లాడుతూ పిల్లలు, వృద్ధులు మరియు గర్భిణీలు సురక్షిత ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలన్నారు .అనంతరం  జిల్లా న్యాయ సేవధికారిక సంస్థ,లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్, నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ,నైస్ యూత్ ఫర్ కల్చర్  అండ్ ఎడ్యుకేషన్ సొసైటీలు సంయుక్త ఆధ్వర్యంలో   ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవ ప్రచార గోడ పత్రికలను ఆవిష్కరించారు.       ఈ కార్యక్రమంలో లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, పానల్ అడ్వకేట్లు, పారా లీగల్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

About Author