NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాయచోటిలో గర్జించిన వైసీపీ నిరసన యువగళం

1 min read

కూటమి ప్రభుత్వానికి రాయచోటి నుంచి హెచ్చరిక.

డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ విచారణ చేరిపించాలి

నిరుద్యోగ భృతి, నెరవేరని హామీలపై వైసీపీ పోరుబాట ఉదృతం

రెండో రోజూ హోరెత్తిన రిలే నిరాహార దీక్షలు

నిరుద్యోగ యువత, విద్యార్థులతో కిక్కిరిసిన దీక్షా శిబిరం

అన్నమయ్య జిల్లా  (న్యూస్ నేడు ప్రతినిధి) : ఎన్నికల ముందు యువత, విద్యార్థులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన కూటమి ప్రభుత్వానికి రాయచోటి వేదికగా యువశక్తి గట్టి హెచ్చరిక జారీ చేసింది. డీఎస్సీ–2025 నియామకాలలో చోటుచేసుకున్న అవకతవకలు, స్పోర్ట్స్ కోటా అక్రమాలు, నిరుద్యోగ భృతి అమలులో జాప్యం, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, విద్యాదీవెన–వసతి దీవెన నిధుల విడుదలలో ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజూ ఉధృతంగా కొనసాగాయి. రాయచోటి పట్టణంలోని బంగ్లా ప్రాంతంలోని దీక్షా శిబిరం యువత, విద్యార్థులు, నిరుద్యోగులతో కిక్కిరిసిపోగా, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఉద్యమ వేదిక దద్దరిల్లింది.

డీఎస్సీ కాదు. పేద నిరుద్యోగులకు దగా డిఎస్సి

డీఎస్సీ–2025 నియామకాలలో జరిగిన అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని నాయకులు డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ కోటా నియామకాలలో జరిగిన అవినీతి వెలుగులోకి తీసుకువచ్చి అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని నిలదీశారు.

ఫీజులు కట్టలేని పరిస్థితి… విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు వద్దు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా, మాజీ వైస్ చైర్మన్ ఫయాజుర్ రెహమాన్, వైఎస్సార్‌సీపీ మైనారిటీ జిల్లా అధ్యక్షుడు బేపారి మహమ్మద్ ఖాన్, పట్టణ కన్వీనర్ నవాజ్, బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయభాస్కర్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు జంగంరెడ్డి కిషోర్ దాస్, యువజన విభాగం అధ్యక్షుడు మడితం రెడ్డికుమార్, ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి బుల్లి వెంకటరమణ, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు సగినాల శివశంకర్‌ నాయకులు కొలిమి ఛాన్ బాష, సుగవాసి శ్యామ్,సుగవాసి ఈశ్వర్ ప్రసాద్,  అన్నా సలీం,  అమీర్, వైస్ ఎంపీపీ సమర సింహారెడ్డి,గాలివీడు గుమ్మా అమర నాధ రెడ్డి, జనతా బషీర్,  ఖలీల్, మోక్షిత్, పట్టణ ఉపాధ్యక్షుడు నాగేంద్ర, ఆనందరెడ్డి,మాజీ కో ఆప్షన్ హజరత్ ఖాదర్ వలీ, రైతు మిత్ర ఖాదర్ బాష,గరుగుపల్లె మాజీ ఎంపిటిసి చిన్నరెడ్డి,   సెల్ పాయింట్ మస్తాన్, యూసుఫ్ ఖాన్,బేపారి జబీవుల్లా,  స్టేట్ ఇంటలేక్షువల్ జాయింట్ సెక్రటరీ సయ్యద్ అమీర్ అలీ,జాలా మహేష్, మల్లూరు అన్వర్, శ్రీనివాసులు,జయచంద్రా రెడ్డి, హాబీబ్, రెడ్డిబాబు,కిరణ్, లాలూ ప్రసాద్, ఆదినారాయణ,   షైఫ్ అలీఖాన్,  జీవన్, నాగార్జున, రవూఫ్,ఆప్ఝల్, ఇర్ఫాన్,సాజిద్ , సోమిరెడ్డి, అశోక్,  భరత్  పాటు భారీగా విద్యార్థులు, యువత , నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author