అంబేద్కర్ విగ్రహాన్ని తొలగిస్తున్నారని చేస్తున్న అసత్య ప్రచారాన్ని నిరసిస్తూ నిరసన
1 min read
వివిధ దళిత సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహణ
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: స్థానిక పాత బస్టాండ్ సెంటర్లో గల భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని్ తొలగిస్తున్నారని కొంతమంది చేస్తున్న అసత్య ప్రచారాన్ని నిరసిస్తూ వివిధ దళిత సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.గత నెల 25వ తేదీన నగరంలోని ఎస్సీ ముఖ్య నాయకులతో స్థానిక ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి ) అధ్యక్షతన వారి క్యాంపు కార్యాలయంలో విగ్రహం మార్పు గురించి సమావేశం నిర్వహించినారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత నెల 23 వ తారీఖున అధికారులు ఇచ్చిన రిపోర్టు మేరకు విగ్రహాన్ని మార్చి సెంటర్లో పెట్టాలని అనుకుంటున్నాను అలా చేస్తే అంబేద్కర్ ని గౌరవిస్తూ అందరికీ ఆదర్శవంతంగా ఉండేలా ఉంటుందని మీరందరూ ఏకాభిప్రాయానికి వచ్చినట్లయితే సెంటర్లోకి తరలిస్తా మీలో ఏ ఒక్కరికి ఇబ్బంది ఉన్న విగ్రహం జోలికి వెళ్ళనని ఆయన తేల్చి చెప్పారు . కాని కొంతమంది కావాలని అంబేద్కర్ విగ్రహాన్ని తొలగిస్తున్నట్టు అసత్య ప్రచారం చేస్తున్నారని దయచేసి జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ప్రతి ఒక్కరు గమనించాలని వివిధ సంఘాల నేతలు ముక్తకంఠంతో ఖండించారు . ఈ కార్యక్రమం ఏపీ ఎస్సీ మాల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి మేడం సంతోష్ మాల మహాసేన జాతీయ అధ్యక్షులు ఆలగా రవికుమార్, మాల మహానాడు అధ్యక్షులు అబ్బూరి అనిల్, జర్నలిస్ట్ మతేబావి, దాసరి వందన శ్యామ్,మాల సేన అధ్యక్షులు ఎరికిపాటి విజయ్, క్రిస్టియన్ మైనారిటీ జిల్లా అధ్యక్షులు జుంజు మోజెస్ ఏలూరు నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు పెద్దాడ వెంకటరమణ మాజీ ఎంపీపీ లంకపల్లి మాణిక్యాలరావు రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకులు జలాబాలాజీ, లాలా జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ సభ్యులు నల్లమిల్లి శంకర్,దొడ్డిగర్ల శుభ మల్లిక్ పులవర్తి డేవిడ్ రెల్లి సంఘం నాయకులు ధనియాల ఈశ్వర్ అప్పారావు మాల మహానాడు మరియు మాదిగ దండోరా నాయకులు పాల్గొన్నారు.


