NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలి ..

1 min read

మూడో రోజుకు చేరిన అంగన్వాడీల రిలే నిరసన దీక్షలు  

న్యూస్ నేడు, పత్తికొండ:  సమస్యల పరిష్కారం కోసం పత్తికొండ పట్టణంలోని కోరమండల్ వద్ద అంగన్వాడీలు చేపట్టిన రిలే నిరసన దీక్షలు బుధవారం నాటికి మూడవ రోజుకు చేరుకున్నాయి. అంగన్వాడీలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ  రిలే  దీక్షల శిబిరం నుండి ర్యాలీగా వెళ్లి స్థానిక ఐసిడిఎస్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు వెంకటేష్ రెడ్డి శ్రీరాములు మాట్లాడుతూ, అంగన్వాడీల న్యాయమైన కోరికలను పరిష్కరించాలని కనీస వేతనం 26వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రాజెక్టు డైరెక్టర్ విజయ మేడంకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షులు గోపాల్, రాముడు ప్రజానాట్యమండలి రమేష్, అంగన్వాడి వర్కర్స్ యూనియన్ నాయకురాలు రామాంజనమ్మ, పద్మజ, రాఘవేంద్రమ్మ, లక్ష్మి, మాధవి, కస్తూరి, అంగన్వాడీలు పాల్గొన్నారు.

About Author