NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రవీంద్ర విద్యాసంస్థల్లో యోగా దినోత్సవ వేడుకలు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  స్థానిక వెంకయపల్లి లోని  జి. పుల్లయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు రవీంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ అలాగే……. అబ్బాస్ నగర్ లోని రవీంద్ర విద్యానికేతన్,రవీంద్ర బాలికల పాఠశాలల ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఆదివారం కళాశాల మరియు పాఠశాల ప్రాంగణంలో అత్యంత ఉత్సాహంగా జరిగాయి. ఈ కార్యక్రమలలలో అధ్యాపక బృందం, బోధనేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు వందల సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అంతర్జాతీయ యోగా శిక్షకులు ప్రసన్న  ముఖ్య అతిథిగా హాజరై యోగా సెషన్‌కు మార్గదర్శకత్వం వహించారు. ఆమె పర్యవేక్షణలో విద్యార్థులు, అధ్యాపకులు సూర్య నమస్కారాలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రాణాయామం, తాడాసనం, వృక్షాసనం, భుజంగాసనం వంటి సరళమైన ఆసనాలను సాధన చేశారు. ప్రతి ఆసనం యొక్క ప్రాముఖ్యతను, శరీరంపై దాని ప్రభావాన్ని ప్రసన్న  వివరించారు. అబ్బాస్ నగర్ లోని పాఠశాలలో యోగా మాస్టర్ అమరేష్ ఆధ్వర్యంలో యుగా కార్యక్రమం నిర్వహింపబడింది. ఈ కార్యక్రమంలో రవీంద్ర విద్యా సంస్థల వ్యవస్థాపకులు జి.పులయ్య , వైస్ చైర్మన్ జి. వంశీధర్  పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాలలో ప్రిన్సిపాల్స్ డాక్టర్ సి. శ్రీనివాసరావు మరియు డాక్టర్ ఎన్. శ్రీకాంత్ సంయుక్తంగా మాట్లాడుతూ, “యోగా” భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన వరం. ఇది కేవలం వ్యాయామం మాత్రమే కాదు, శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. నేటి ఒత్తిడి జీవితంలో ఏకాగ్రతను పెంచుకోవడానికి యోగా చక్కటి సాధనం” అని అన్నారు. యోగను దినచర్యలో భాగం చేసుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *