NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్నూల్ మెడికల్ కాలేజీలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  నేడు ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు, డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆదేశాల మేరకు కర్నూల్ మెడికల్ కాలేజీలో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.భారత్ స్వాభిమాన్ ట్రస్ట్, పతంజలి యోగ సమితి సభ్యులు, యోగ శిక్షకులు, కళాశాల అధ్యాపకులు మరియు విద్యార్థుల సమక్షంలో యోగా ఆసనాలు, ప్రాణాయామం నిర్వహించి యోగా వల్ల కలిగే శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమానికి అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ & కర్నూల్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా. కె. చిట్టి నరసమ్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో అనాటమీ విభాగాధిపతి డా. శోభాదేవి, ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డా. మంజుల భాయి, అసోసియేట్ ప్రొఫెసర్ డా. సోమశేఖర్,డా. శివరామ్ ఫిజియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఉమామహేశ్వరి, లెక్చరర్ బి. సురేష్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ రామకృష్ణ, సమద్  భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ జిల్లా అధ్యక్షులు, యోగ శిక్షకులు శివరాజు, పతంజలి యోగ సమితి అధ్యక్షులు ఉపేంద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు. యోగ శిక్షకులు శివరాజుకు ఉపేంద్ర కొడుకు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా యోగా ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగమై ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడాలని వక్తలు ఆకాంక్షించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *