NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టును ఖండించిన వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు

1 min read

కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది: ఎస్.కె. గిరి

హోళగుంద న్యూస్ నేడు : హోళగుంద మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల సమావేశంలో ఆలూరు ఎమ్మెల్యే బుసినె విరూపాక్షి అరెస్టును పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.కె. గిరి, సీనియర్ నాయకుడు ఈసా మాట్లాడుతూ, ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే విరూపాక్షిని అక్రమంగా అరెస్టు చేసి కూటమి ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందుతోందని ఆరోపించారు.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలను పరిష్కరించడం పక్కనపెట్టి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తూ రాజకీయ కక్షసాధింపుకు పాల్పడుతోందని విమర్శించారు.రాష్ట్రంలో ప్రస్తుతం రాజ్యాంగ పాలన కాకుండా “రెడ్ బుక్” పాలన నారా లోకేష్ ఆధ్వర్యంలో నడుస్తోందని ఆరోపించారు. అధికారం శాశ్వతం కాదని, ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో తగిన సమాధానం ఇస్తామని తెలిపారు.ఈ సమావేశంలో నాయకులు శేషప్ప, మంజునాయక్, మల్లయ్య, యల్లప్ప, వెంకటేశ్, దేవన్నతో పాటు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *