NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నిరుపేద మహిళలకు దొమతెరలు, మస్కిటో కాయల్స్ పంపిణీ చేసిన డా. శంకర్ శర్మ

1 min read

కర్నూలు, న్యూస్ ​నేడు:  కర్నూలు నగరంలోని గాయత్రీ ఎస్టేట్ లో ఉన్న జై గురుదత్త పాలిక్లినిక్ లో డాక్టర్. శంకర్ శర్మ నిరుపేద మహిళలకు  దోమతెరలు, మస్కిటో కాయల్స్ పంపిణీ చేశారు.ఆదరణ డే కేర్ సెంటర్ లో ఉంటున్న దాదాపు 50 మంది వృద్ద మహిళలకు వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు. వర్షాకాలంలో దోమలు ఎక్కువగా ఉంటాయని ప‌రిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలని డాక్టర్. శంకర్ శర్మ తెలిపారు. అపరిశుభ్రంగా ఉన్న చోటే  దోమలు ఎక్కువగా ఉంటాయన్నారు. దోమతెరలు వాడి ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారు. దోమల వల్ల ప్రాణాంతక మైన డెంగ్యూ వ్యాది వస్తుందని అందువల్ల తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. దోమలను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయ పరిస్థితులు వస్తాయని డాక్టర్. శంకర్ శర్మ తెలిపారు. వర్షాకాలంలో ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తలు పాటించాలని కోరారు.ఈకార్యక్రమంలో ఆదరణ డే కేర్ సెంటర్ నిర్వహకులు రంజిత్ పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *