గరికిపాటి మృతి హేలాపురి నగర ప్రజలకు తీరని లోటు
1 min read
గరికిపాటి ఆర్ట్స్ థియేటర్స్ వ్యవస్థాపకులు,వై యంహెచ్ ఏ సభ్యులు గరికిపాటి కాళిదాసు స్వర్గస్తులయ్యారు
వైఎంహెచ్ఏ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్ష , కార్యదర్శి, సభ్యులు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరుజిల్లా రాష్ట్ర ప్రభుత్వ ట్రెజరీ శాఖ మాజీ అధికారి, ‘గరికిపాటి ఆర్ట్స్ థియేటర్స్’ వ్యవస్థాపకులు, వై యం హెచ్ ఏ సభ్యులు గరికిపాటి కాళిదాసు (ఏలూరు) సోమవారం 31-08-2026 స్వర్గస్తులయ్యారు. ఏలూరు అగ్రహారంలోని (వైభవ్ ఫోర్ట్స్) అపార్ట్మెంట్లోని వారి నివాసంలో సందర్శనార్థం ఉంచిన కాళిదాసు పార్థివ దేహాన్ని వైఎంహెచ్ఏ మేనేజ్మెంట్ కమిటీ ప్రధాన కార్యదర్శి కె.వి సత్యనారాయణ, కార్యనిర్వాహక కమిటీ ఉపాధ్యక్షులు ఎల్. వెంకటేశ్వరరావు (ఎల్విఆర్), సహాయ కార్యదర్శి కెబి రావు, కమిటీ సభ్యులు పెదపాటి రామకృష్ణ,డాక్టర్:లంకా వెంకటేశ్వర్లు,పుల్లాభోట్ల పురుషోత్తం,గుత్తా కౌసలేందర్రావు,ఎం. సూర్యనారాయణ యాదవ్ తదితరులు కాళిదాసు పార్థివ దేహం వద్ద పుష్పమాలలు ఉంచి ఘన నివాళులర్పించారు. గరికపాటి దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి రామారావు తో చలనచిత్రంలో నటించడం ఒక మధురానుభూతిగా అభివర్ణించారు. ఆయన మరణం హేలాపురి నగర ప్రజలకు,కళా కారులకు, రంగస్థలం అభిమానులకు తీరని లోటని,వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,ప్రగాఢ సానుభూతిని, ఓదార్పును తెలియజేశారు.గరికిపాటి కాళిదాసు మృతి పట్ల వైఎంహెచ్ఏ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు యర్రా సోమలింగేశ్వరరావు,కోశాధికా రి కానాల బాల వెంకట రమేష్ , కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షులు యిరదల ముద్దుకృష్ణ,ప్రధాన కార్యదర్శి మజ్జి సూర్యకాంతరావు, కోశాధికారి గాదంశెట్టి శ్రీనివాసరావు తదితర సభ్యులు తమ తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు.వారి ఆత్మకు శాంతి చేకూరాలని కెవి సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి వైఎంహెచ్ఏ మేనేజ్మెంట్ కమిటీ పత్రికా ప్రకటనలో తెలియజేశారు.


