NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

“ఉచిత కంటి” వైద్య శిబిరంలో 19 మందికి ఆపరేషన్లు !

1 min read

న్యూస్ నేడు పత్తికొండ: పత్తికొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పూర్వ విద్యార్థులు మరియు యువ స్పందన సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరంలో 19 మందికి కంటి ఆపరేషన్లు జరిగాయని ఆసుపత్రి నిర్వాహకులు అరులు తెలిపారు. గురువారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఉచిత కంటి వైద్య శిబిరం యందు వైద్య పరీక్షల   అనంతరం ఆపరేషన్లు చేయించుకున్న వారికి సలహాలు, సూచనలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. బెంగళూరు చిట్టెం హనుమాన్ ప్రసాద్, చెన్నై శంకర నేత్రాలయ ఆసుపత్రి సహకారంతో అత్యాధునిక పరికరాలతో ఎనిమిది రోజుల నుండి కంటి వైద్య పరీక్షలు మరియు నాలుగు రోజుల నుండి కంటి ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం పత్తికొండ ఎస్బిఐ చీఫ్ మేనేజర్ జానకిరామయ్య అన్నదానం మరియు తుగ్గలి మాజీ ఎంపీపీ  గురుస్వామి   మజ్జిగ పంపిణీ చేశారు.  అనంతరం వారు మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంతాలలో ఉచిత కంటి వైద్య పరీక్షలు, ఆపరేషన్లు  నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఉచిత కంటి వైద్య శిబిరంలో దాదాపు 75 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారని యువ స్పందన సొసైటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్ధి వీరేశప్ప, యువ స్పందన సొసైటీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు సురేంద్ర, లక్ష్మన్న, సెక్రటరీ నాగరాజు, సభ్యులు మధు, రమేష్, గిరి,  రాజేశ్వరి, వాలంటీర్లు, ఆసుపత్రి సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.గత వారం రోజులుగా వైద్య చికిత్సలు చేయించుకున్న వారికి మాత్రమే శుక్రవారం ఆపరేషన్లు జరుగుతాయని పూర్వ విద్యార్థి   వీరేశప్ప, యువ స్పందన సభ్యులు సురేంద్ర, లక్ష్మన్న, నాగరాజు  తెలిపారు.

About Author