NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలూరు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

1 min read

ఎమ్మెల్యే బుసినే విరూపాక్షికి తీర్థ ప్రసాదాలు అందజేసిన ఆలయ అర్చకులు

రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం శ్రీవారిని ప్రార్థించిన ఆలూరు ఎమ్మెల్యే

తిరుమలలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన బుసినే విరూపాక్షి

ఆలూరు న్యూస్ నేడు: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  స్వామివారి సన్నిధిలో రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, ఆలూరు నియోజకవర్గ ప్రజలకు ఆయురారోగ్యాలు, అభివృద్ధి కలగాలని ప్రార్థించారు.అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి కి వేద ఆశీర్వచనాలు అందజేసి, తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ తిరుమల శ్రీవారి దర్శనం ఎంతో ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని తెలిపారు. ప్రజల ఆశీస్సులతో ముందుకు సాగుతూ నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బీవీఆర్ అభిమానులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. తిరుమలలో ఎమ్మెల్యే కి పార్టీ నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమం భక్తి శ్రద్ధల నడుమ విజయవంతంగా జరిగింది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *