బిజేపి లోకి 20 కుటుంబాలు చేరిక
1 min read
ప్యాపిలి న్యూస్ నేడు: భారతీయ జనతా పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు ఆదేశాల మేరకు, అలాగే బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు సందు వెంకటరమణ సూచనల మేరకు, ప్యాపిలి మండల బిజెపి అధ్యక్షులు దామోదర్ నాయుడు ఆధ్వర్యంలోప్యాపిలి పట్టణానికి చెందిన పూజారి శివ కేశవ, నూతనంగా పార్టీలో చేరిన వారిలో పూజారి శివ కేశవ్ తో పాటు సుమారు 20 కుటుంబాలు బీజేపీ కండువా కప్పుకొని సునీల్,శ్రీకాంత్, విక్రం,రంజిత్, యోగి, ప్రసాద్, మహేంద్ర బాబు పార్టీలో చేరారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్యాపిలి మండలంలో బీజేపీ బలపడటానికి ఇది ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని, భవిష్యత్తులో మరింత మంది ప్రజలు పార్టీలో చేరే అవకాశం ఉందని నాయకులుప ఆశాభావం వ్యక్తం చేశారు.భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ దేశభక్తి, అభివృద్ధి, సామాజిక న్యాయం లక్ష్యంగా పనిచేస్తుందని, యువత శక్తిని సద్వినియోగం చేసుకుంటూ రాబోయే రోజుల్లో ప్యాపిలి మండలంలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కిషన్,మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కేసి మద్దిలేటి, బీజేపీ యువమోర్చా జిల్లా అధ్యక్షులు సిలువేరు వెంకటేష్, బీజేపీ యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి విజయభాస్కర్, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్మీ రామయ్య, మాజీ జిల్లా కార్యదర్శి రామచంద్ర నాయుడు బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.


