ఆటో కార్మికుల డిమాండ్ల కోసం 12న జరిగే సమ్మెలో పాల్గొనండి
1 min read
సిఐటియు మండల కార్యదర్శి ఎం. రవిచంద్ర,
పత్తికొండ, న్యూస్ నేడు: ఎంతోకాలంగా సమస్యలను ఎదుర్కొంటున్న ఆటో కార్మికులు ఈ నెల 12న జరిగే సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలని సిఐటియు మండల కార్యదర్శి ఎం రవిచంద్ర కోరారు. సమస్యలు ప్రభుత్వం పరిష్కరించడం లేదని ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి ఆరోగ్య భీమాను కల్పించాలని పత్తికొండ పట్టణంలోని స్థానిక గుత్తి రోడ్డు సర్కిల్లో ఉన్న సిఐటియు అడ్డ దగ్గర సిఐటియు ఆటో వర్కర్స్ యూనియన్ నాయకుడు తుగ్గలి రవి అధ్యక్షతన బుధవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 12న దేశవ్యాప్త సమ్మెలో అత్యధిక సంఖ్యలో ఆటో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కార్మికుల హక్కులను కాలరాసే నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గుత్తి సర్కిల్లో ఉన్న ఆటో కార్మికులపై పోలీసులు చలానాల పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని రెక్కాడితే కానీ డొక్కాడని ఆటో కార్మికులపై రక్షణ దళం కన్నెర్ర చేస్తే ఏం ప్రయోజనం అని అన్నారు. ఆటో కార్మికుడు రోజువారీగా పనిచేస్తే 500 రూపాయలు వస్తుందని అలాంటిది వేలకు వేలు ఫైన్లు వేస్తే వారి జీవనంపై ప్రభావం పడుతుందని గుత్తి సర్కిల్లో ఆటోలు నడుపుకుంటున్న ఆటో కార్మికులకు కనీసం వసతి గృహాలు కూడా సరిగా లేవని దీన్ని అధికారులు దృష్టిలో ఉంచుకోవాలన్నారు. 2000 3000 ఫైన్లు వేస్తే వారి దిన సరి వేతనం ఐదు రోజులు పని చేయవలసి వస్తుందని అలాంటప్పుడు వారు సంపాదించిన 500 కంటే ఎక్కువ ఫైన్ ల రూపంగా కడితే వారికి పూట గడవడం కష్టమైపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గుత్తి ఆటో స్టాండ్ కార్మికులు అంజి, దావీదు, శివకుమార్, వంశి, కుమార్, నరేష్, తదితరులు పాల్గొన్నారు,

