ప్రపంచ యాంటి క్యాన్సర్ దినోత్సవంపై విద్యార్థినీలకు అవగాహన
1 min read
ప్యాపిలి న్యూస్ నేడు: ప్రపంచ అంటి క్యాన్సర్ దినోత్సవం సందర్బంగా డాక్టర్. రాహుల్ స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో విద్యార్థిని లకు క్యాన్సర్ పైన అవగాహనా కల్పిస్తూ నోటి, రొమ్ము, గర్భశయ ముఖద్వారా క్యాన్సర్ ల ద్వారా ఎక్కువ శాతం బాధపడు చున్నారని, ముఖ్యం గా పోగాకు ఉత్పత్తులు చుట్ట, బీడీ, పానుపరాగ్ మొదలగు వాడడం వలన, జనటిక్స్, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, వ్యాయామం లేకపోవడము వాటి ద్వారా క్యాన్సర్ కు కారణాలు. క్యాన్సర్ పై విజయం స్క్రీనింగ్ ఒక్కటే మార్గం. నోటిలో మానని పుండ్లు రెండు వారాలకు మించి ఉంటే, రొమ్ములో గడ్డలు, షేప్ మారిపోవడం, బ్లీడింగ్ ఎక్కువ గా ఉండడం గర్భశయ ముఖాద్వార క్యాన్సర్ కు దారితీయును కాబట్టి సెల్ప్ ఎక్సమినేషన్, వైద్య సిబ్బంది ని కలసి పరీక్షలు చేయించు కోవలెను.సహకరించవలెను, అవసరం మేరకు రెఫెర్ చేసి చికిత్స అందిస్తారు. ప్రాథమిక స్థాయి లో గుర్తిస్తే క్యాన్సర్ పూర్తి గా నయం అవుతుంది అని తెలిపారు. డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ అధికారి రాఘవేంద్ర గౌడు స్పర్శ కుష్ఠు వ్యాధి,క్షయ, వివిధ వ్యాదుల పైన అవగాహనా కల్పించారు. కార్యక్రమం లో అధ్యాపకులు స్వర్ణలత, విజయలక్ష్మి,పర్యవేక్షకులు సరోజ, ఏ ఎన్ ఎం అరుణ భాయ్, ఆశ కార్యకర్త రమాదేవి, విద్యార్థినిలు పాల్గొన్నారు.

