NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మాసపేట మాజీ సర్పంచ్ సేవలు ఎనలేనివి

1 min read

మాజీ సర్పంచ్ ను సత్కరించిన జడ్పీటీసీ

మిడుతూరు(నందికొట్కూరు) న్యూస్ నేడు: మాసపేట మాజీ సర్పంచ్ ఎస్ శంషున్ భీ సేవలు ఎనలేనివని మిడుతూరు జడ్పిటీసీ పర్వత యుగంధర్ రెడ్డి అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని మాసపేట గ్రామ మాజీ సర్పంచ్ ను ఘనంగా సత్కరించారు.శుక్రవారం గ్రామ సచివాలయంలో ‘జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం’ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జడ్పిటిసి యుగంధర్ రెడ్డి,సీనియర్ నాయకులు వంగూరు జనార్దన్ రెడ్డి మరియు పంచాయతీ కార్యదర్శి బి. శ్రీధర్ మాజీ మహిళా సర్పంచ్గ్రామ అభివృద్ధికి కృషి చేసినందుకు గాను శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా జడ్పిటిసి మాట్లాడుతూ 2021 లో గ్రామ సర్పంచ్ గా ఎన్నికై గత ఐదేళ్లుగా మాసపేట,ఉప్పలదడియ, కలమందలపాడు గ్రామాల్లో ప్రజలకు నీటి సమస్యను తలెత్తకుండా అదేవిధంగా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు సర్పంచ్ ఎంతగానో కృషి చేశారని ఆమె చేసిన సేవలను వారు కొనియాడారు.ఈ కార్యక్రమంలో మధుసూదన్ రెడ్డి,చంద్రశేఖర్ రెడ్డి, రామసుబ్బారెడ్డి,అన్వర్ భాష,కలమందలపాడు మహబూబ్ మరియు సచివాలయ సిబ్బంది రహీం, పవిత్ర,గీత,గాయత్రి పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *