జిల్లా స్థాయి శాప్ బాక్సింగ్ లీగ్స్ పోటీలు
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ, విజయవాడ వారి ఆదేశాల మేరకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, కర్నూలు వారు 24-04-2026 తేదిన జిల్లా స్థాయి శాప్ బాక్సింగ్ లీగ్స్ జూనియర్ అండర్ – 15 మరియు అండర్ -19 యూత్ వయస్సు విభాగాలలో బాలురు మరియు బాలికలకు బాక్సింగ్ పోటీలు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అవుట్ డోర్ స్టేడియం, నందు నిర్వహించడమైనది. ఈ జిల్లా స్థాయి శాప్ లీగ్స్ బాక్సింగ్ పోటీలలో 34 మంది బాలురు మరియు బాలికలు పాల్గోన్నారు.ఇందులో గెలుపొందిన క్రీడాకారులను ఈ నెల 28 నుండి 30 ఏప్రిల్, 2026 తేది వరకు విశాఖ పట్నం జిల్లాలో జరగబోయే రాష్ట్ర స్థాయి శాప్ బాక్సింగ్ లీగ్స్ పోటీలకు పంపడం జరుగుతుంది.ఈ కార్యక్రమమునకు శ్రీ బి. భూపతి రావు, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి, కర్నూలు, బాక్సింగ్ క్రీడా సంఘము ప్రతినిధులు, ఇతర సంఘాల ప్రతినిధులు, శిక్షకులు, సిబ్బంది, సీనియర్ క్రీడాకారులు మరియు పత్రిక విలేకరులు పాల్గోన్నారు.

