పదవీ విరమణ పొందిన అధికారులకు సన్మానం
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: జిల్లా మలేరియా అధికారి అనంతపల్లి నూకరాజు మరియుజిల్లా పట్టు పరిశ్రమల అధికారి దిండుకుర్తి ఆంజనేయులను జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ మెమెంటో మరియు శాలువాలతో సత్కరించారు.ఈ సందర్బంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పదవి విరమణ పొందిన అధికారులు ఆయురారోగ్యాలతో , ఆనందంగా , కుటుంబ సమేతంగా సుఖశాంతులతో నిండిన జీవితం గడపాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని తెలిపారు.ఈ కార్యక్రమం లో ఇంచార్జి జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ చిరంజీవి,అబ్కారి శాఖ సూపరింటెండెంట్ సుధీర్, సీఈఓ సెట్కూరు వేణుగోపాల్, జిల్లా టూరిజం అధికారి జిలక్ష్మి నారాయణ, సాంఘిక సంక్షేమ శాఖ అధికారిణి రాధిక మొదలగు వారు పాల్గొన్నారు

