NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆలూరు నియోజకవర్గంలో ఘనంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

1 min read

వైకుంఠం జ్యోతి మార్గదర్శకత్వంలో హోళగుంద మండలంలో కార్యక్రమం – లబ్ధిదారుల్లో ఆనందం వెల్లివిరిసింది

హోళగుంద న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని అమలు చేస్తున్న “ఎన్టీఆర్ భరోసా” పథకం ద్వారా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  ప్రవేశపెట్టిన ఈ పథకం వృద్ధులు, వికలాంగులు, విధవలు మరియు ఇతర అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక భద్రతను కల్పిస్తోంది.ఈ సందర్భంగా ఆలూరు నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఆలూరు టిడిపి ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి  ఆదేశాల మేరకు హోళగుంద మండలం బస్టాండ్ పరిధిలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో టిడిపి మండల ప్రధాన కార్యదర్శి ఈబీజీ గోవింద్ గౌడ్ , మాజీ మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ పంపాపతి , టిడిపి సీనియర్ నాయకులు యారిస్వామి , మండల మైనార్టీ అధ్యక్షులు ముల్లా మొయిన్ , యువనాయకులు సింధువలం మల్లి, షాలి అమన్, మల్లయ్య ,తదితరులు పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. సచివాలయ సిబ్బంది నాయక్  కూడా కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యారు.పెన్షన్లు అందుకున్న లబ్ధిదారులు ప్రభుత్వం అందిస్తున్న సహాయంపై సంతోషం వ్యక్తం చేస్తూ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పథకం తమ జీవనోపాధికి ఎంతో దోహదపడుతోందని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

About Author