హాలహర్విలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
1 min read
కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి
వికలాంగులు, వృద్ధులు, వితంతువులకు పెన్షన్ల పంపిణీ
వైకుంఠం శివ ప్రసాద్ సమక్షంలో కార్యక్రమం
గ్రామస్థుల ఆనందం, నాయకుల అభినందనలు
సంక్షేమ పథకాల అమలుపై హర్షం
ఆలూరు న్యూస్ నేడు; హాలహర్వి మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో టీడీపీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు స్వయంగా అందజేశారు.ఈ సందర్భంగా వికలాంగులు, వృద్ధులు, వితంతువులు తదితర అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వైకుంఠం శివ ప్రసాద్ గారు కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ నాయకులు సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సహాయం ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, మాజీ కన్వీనర్లు, క్లస్టర్ ఇంచార్జులు, యూనిట్ ఇంచార్జులు, బూత్ ఇంచార్జులు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు, సొసైటీ చైర్మన్లు, సొసైటీ డైరెక్టర్లు, ఆలూరు నియోజకవర్గం సీనియర్ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపిటిసీలు, మాజీ ఎంపిటిసీలు, ఎంపీపీలు, మాజీ ఎంపీపీలు, టీడీపీ యూత్ నాయకులు మరియు వైకుంఠం అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

