ప్రపంచ కార్మికులారా ఏకంకండి…
1 min read
కార్మిక చట్టాల పరిరక్షణకై ఉద్యమాలు చేపడుదాం… బి. గిడ్డయ్య
మే డే ర్యాలీని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ పి రామచంద్రయ్య ప్రారంభించారు.
మేడే ర్యాలీ అనంతరం స్థానిక నాలుగు స్తంభాల దగ్గర బహిరంగ సభ జరిగింది.
బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడుతున్న సిపిఐ జిల్లా కార్యదర్శి బి. గిడ్డయ్య
న్యూస్ నేడు, పత్తికొండ: ప్రపంచ కార్మికులారా ఏకంకండి, కార్మిక చట్టాల పరిరక్షణకై ఉద్యమాలు చేపడు దా మని సిపిఐ జిల్లా కార్యదర్శి బి. గిడ్డయ్య, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు ఎన్. కృష్ణయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో 140 వ మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తేరుబజార్ నుండి నాలుగు స్తంభాల మండపం వరకు కార్మికలతో భారీ ర్యాలీ చేపట్టారు. ఏఐటియుసి నియోజకవర్గ అధ్యక్షులు నెట్టికంటయ్య అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ సర్కిల్ కూడలిలో ఏఐటీయూసీ పతాకాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి బి. గిడ్డయ్య ఆవిష్కరించగా, కూరగాయల మార్కెట్ దగ్గర,ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎన్. కృష్ణయ్య పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బి. గిడ్డయ్య మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాసే విధంగా 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లుగా కుదించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. సుప్రీం కోర్ట్ తీర్పు ప్రకారం కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ఎనిమిది గంటల పని విధానం కొనసాగించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమాలను ఉదృతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి ఎం.రంగన్న, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నబి రసూల్, పత్తికొండ, తుగ్గలి మండల కార్యదర్శు తదితరులు పాల్గొన్నారు.

