NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మేడే కార్మిక హక్కుల కోసం పోరాడుదాం

1 min read

మండల కేంద్రమైన హోళగుందలో స్థానిక బస్టాండ్  లో  ఏఐటియుసి జెండా ఎగరవేయడం జరిగినది

హోళగుందన్యూస్ నేడు: మేడే దినోత్సవాన్ని కార్మిక హక్కుల పరిరక్షణ దినంగా జరుపుకోవాలని ఆయన కోరారు  సిపిఐ ‌ఆద్వర్యంలో.మేడే 140 వ దినోత్సవం సందర్భంగా ఐటియుసి  జెండా సిపిఎం మండల కార్యదర్శి  మారెప్ప ఎగరవేయడం జరిగింది అలాగే సులువాయి గ్రామంలో అమాలి అస్నప్ప  చేతుల మీదుగా ఏఐటీయూసీ జెండాను ఎగిరి వేయడం జరిగినది    ఈ  ‌కార్యక్రమానికి సిపిఐ  మండల కార్యదర్శి మారెప్ప  ఆయన మాట్లాడుతూ   మోడీ అమిత్షా పాలనలో కార్మికుల హక్కుల హరించబడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లుగా చేసి ఏప్రిల్ 1 నుండి అమలు చేస్తున్నారని అవి రద్దు అయ్యే వరకు ఉద్యమించాలని కోరారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని ఆయన కోరారు.  ఎనిమిది గంటల పని విధానం. కొనసాగించాలన్నారు  మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని సంవత్సరానికి 200 రోజులు వేతనం 600 చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలలో ఏఐటీయూసీ  మండల కార్యదర్శి కే రంగన్న రైతు సంఘం మండల కార్యదర్శి కృష్ణయ్య ఆలూరు తాలూకా అధ్యక్షులు శివప్ప ఆలూరు మండల కార్యదర్శి రామాంజనేయులు సిద్ధ రామ నాగరాజు అబ్దుల్లా హినాయక్ సలాం సాబ్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

About Author