“ఉచిత కంటి వైద్య శిబిరాన్ని” ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి !
1 min read
రెండవ రోజు కొనసాగిన ఉచిత కంటి వైద్య శిబిరం
న్యూస్ నేడు, పత్తికొండ: ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పత్తికొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థులు అడ్వకేట్ సురేష్ కుమార్, సింగరి శివయ్య, సీనియర్ లెక్చరర్ వీరేశప్ప కోరారు. శుక్రవారం పత్తికొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పూర్వ విద్యార్థులు మరియు యువ స్పందన సొసైటీ ఆధ్వర్యంలో 2వ రోజు ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించారు. చెన్నై శంకర నేత్రలాయ కంటి ఆసుపత్రి, బెంగళూరు చిట్టెం హనుమాన్ ప్రసాద్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరానికి పత్తికొండ, తుగ్గలి, దేవనకొండ, మద్దికేర, ఆస్పరి మండలాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఉచిత కంటి వైద్య శిబిరానికి వచ్చిన ప్రజలకు బెంగళూరు వాసవి అన్నదాన ట్రస్టు నిర్వాహకులు మజ్జిగ పంపిణీ చేశారు. ఉచిత కంటి వైద్య శిబిరంలో దాదాపు 140 మందికి వైద్య పరీక్షలు చేశామని శంకర నేత్రాలయ ఆసుపత్రి కోఆర్డినేటర్స్ అరులు, నీరంజాన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో యువ స్పందన సొసైటీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు సురేంద్ర, లక్ష్మన్న, సెక్రటరీ నాగరాజు, సభ్యులు మధు, రమేష్, జిలాన్, రాజేశ్వరి, వాలంటీర్లు, ఆసుపత్రి సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.


