పేదలకు అండగా ‘ఎన్టీఆర్ భరోసా పింఛన్లు
1 min read
దెందులూరు నియోజకవర్గవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
46 మంది లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన స్పౌజ్ , దీర్ఘకాలిక పింఛన్లు అందజేత
గ్రామాల్లో వృద్ధులు, వితంతువులతో ఎమ్మెల్యే చింతమనేని ఆత్మీయ పలకరింపు
భర్త చనిపోతే భార్యకు తక్షణమే పింఛన్.. ‘స్పౌజ్’ పింఛన్లతో కూటమి ప్రభుత్వ మార్క్
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: దెందులూరులో 35 వేల49 మందికి రూ. 15కోట్ల62లక్షల 70వేలు పింఛన్ల రూపంలో అందిస్తూ అండగా నిలుస్తున్న కూటమి ప్రభుత్వంపేదల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అందిస్తున్న ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో దెందులూరు శాసనసభ్యులు శ్రీ చింతమనేని ప్రభాకర్ శుక్రవారం నియోజకవర్గవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. పెదవేగి మండలం రాయన్నపాలెం, ఏలూరు రూరల్ చాటపర్రు, దెందులూరు మండలం నాగులదేవునిపాడు, మరియు పెదపాడు మండలం పెదపాడు గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఆయన స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు పింఛన్ సొమ్మును అందజేశారు.ఈ పర్యటనలో భాగంగా వితంతువులు మరియు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మొత్తం 46 మందికి నూతనంగా మంజూరైన స్పౌజ్, దీర్ఘకాలిక వ్యాధుల పింఛన్లను చింతమనేని ప్రభాకర్ అందజేశారు. వృద్ధులు, దివ్యాంగుల వద్దకు స్వయంగా వెళ్లి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ పింఛన్ అందించిన ఎమ్మెల్యే తీరు చూసి లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. దెందులూరు నియోజకవర్గంలో 35,049 మందికి ప్రతి నెలా రూ. 15 కోట్ల 62 లక్షల 70వేల రూపాయల పింఛన్ సొమ్మును నేరుగా లబ్ధిదారులకు అందజేస్తున్నాం అని తెలిపారు. నాడు అన్న నందమూరి తారకరామారావురూ:35తో ప్రారంభించిన ఈ పింఛన్ పథకం,నేడు ఏన్ డి ఏ కూటమి ప్రభుత్వంలో రూ:4000లకు పెరిగి పేదవాడి కడుపు నింపుతోందని గుర్తు చేశారు. ఐదేళ్లలో పెంచుకుంటూ పోతానంటూ కేవలం వెయ్యి రూపాయలు పెంచి మోసం చేసిన వైసీపీకి భిన్నంగా, అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే బకాయిలతో కలిపి రూ:7,000 అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.అంతకుముందు, పర్యటనలో భాగంగా ఆయా గ్రామాల్లోని ఎన్టీఆర్ విగ్రహాలకు ఎమ్మెల్యే పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు,మండల స్థాయి అధికారులు,సిబ్బంది, ప్రజా ప్రతినిధులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

