NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తిరుణాల’లో పాల్గొన్న బైరెడ్డి మల్లికార్జున రెడ్డి..

1 min read

మిడుతూరు(నందికొట్కూరు) న్యూస్ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ చెన్నకేశవ తిరుణాలలో నందికొట్కూరు వైసీపీ నాయకులు బైరెడ్డి మల్లికార్జున రెడ్డి పాల్గొన్నారు. శుక్రవారం సాయంత్రం జరిగిన రథోత్సవ కార్యక్రమంలో ముందుగా దేవాలయంలో బైరెడ్డి మల్లికార్జున రెడ్డి పూజలు నిర్వహించారు. తర్వాత ఆలయ కార్య నిర్వహణ అధికారి లక్ష్మీనారాయణ మరియు తాత్కాలిక ఆలయ తాత్కాలిక కమిటీ చైర్మన్ భూమా కృష్ణ మోహన్ రావు బైరెడ్డి మల్లికార్జున రెడ్డిని ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసీ లు పర్వత యుగంధర్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి,ఏఎంసీ మాజీ చైర్మన్ తువ్వా చిన్న మల్లారెడ్డి,మండల కన్వీనర్ తువ్వా లోకేశ్వర్ రెడ్డి,మన్సూర్,రాముడు తదితరులు పాల్గొన్నారు.

About Author