తమిళనాడులో విజయ్ రాజకీయ ప్రవేశం చారిత్రాత్మకం – యస్.కె. గిరి
1 min read
ఒంటరిగా పోటీ చేసి ప్రజల మద్దతు పొందడం అభినందనీయం
జగనన్న మాదిరిగా ప్రజల విశ్వాసంతో ముందుకు రావాలి
ఎన్నికల హామీలు అమలు చేసి ప్రజల ఆశలను నెరవేర్చాలి
హోళగుంద న్యూస్ నేడు; హోళగుంద మండలం ఎల్లార్తి గ్రామంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు యస్.కె. గిరి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తమిళనాడు రాష్ట్ర రాజకీయ పరిణామాలపై స్పందించారు.తమిళనాడు రాష్ట్రంలో టీవీకే పార్టీ అధినేత విజయ్ తొలిసారిగా పార్టీ స్థాపించి, ఒంటరిగా పోటీ చేసి చరిత్ర సృష్టించడం అభినందనీయమని తెలిపారు. ఇటువంటి ధైర్య నిర్ణయం తీసుకొని ప్రజల మద్దతుతో ముందుకు సాగడం విశేషమని ఆయన పేర్కొన్నారు.అలాగే, ఆంధ్రప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రి జగనన్న మాదిరిగా ఒంటరిగా పోటీ చేసి ప్రజల విశ్వాసం పొందిన విధంగా, తమిళనాడులో కూడా ప్రజల ఆశీర్వాదంతో విజయ్ అతి తక్కువ కాలంలో ముఖ్యమంత్రి కావడం ఒక చారిత్రాత్మక సంఘటనగా అభివర్ణించారు.తమిళనాడు ప్రజలు నమ్మి ఇచ్చిన ఓట్లను గౌరవిస్తూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని విజయ్ ని యస్.కె. గిరి కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

