నిద్రమత్తు వలన ప్రమాదాలకు గురి కాకుండా” ఫేస్ వాష్”
1 min read
రహదారి ప్రమాదాల నివారణ, అక్రమ రవాణా నిర్మూలన ప్రత్యేక వాహన తనిఖీలు
పెదపాడు ఎస్ఐ ఆర్.శ్రీనివాస్
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు : ఏలూరు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్,ఆదేశాలమేరకు నూజివీడు డిఎస్పీ కె.వి.వి.ఎన్.వి.ప్రసాద్ ఆదేశాల పై ఆదివారం తెల్లవారుజామున నాడు పెదపాడు ఎస్ఐ ఆర్ శ్రీనివాస్ వారి సిబ్బంది రహదారి ప్రమాదాల నివారణకు, అక్రమ రవాణా నిర్మూ లనకు ప్రత్యేక వాహన తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా రాత్రి పూట మరియు తెల్లవారు జామున డ్రైవింగ్ చేసే వాహన దారులు అలసట/నిద్రమత్తు వలన ప్రమాదాలకు గురి కాకుండా ఉండేందుకు ఫేస్ వాష్ కార్యక్రమం నిర్వ హించారు.వాహనదారులకు నిద్ర మత్తులో డ్రైవింగ్ ఎంత ప్రమాదకరమో వివరించి,రహదారి భద్రతపై అవగాహన కల్పించారు.రహదారి ప్రమాదాల నివారణ కొరకు ప్రజలు పాటిం చవలసిన ముఖ్య సూచనలు,సలహాలు అందిoచారు.నిద్ర మత్తులో డ్రైవింగ్ చేయకూడదు డ్రైవింగ్ ప్రారంభించే ముందు తగిన విశ్రాంతి తీసుకోవాలి.అధిక వేగంతో వాహనాలు నడప కూడదు, వేగం తగ్గిస్తే ప్రాణాలు కాపాడ తాయి.హెల్మెట్ & సీట్‌బెల్ట్ తప్పనిసరి చిన్న దూరం ప్రయాణమైనా జాగ్రత్త తప్పక పాటించాలి.మద్యం సేవించి డ్రైవింగ్ చేయకూడదు ఇది కేవలం చట్టపర మైన నేరం కాదు, ప్రాణహాని కలిగిస్తుంది.రాత్రివేళల్లో లైట్లు సరిగా వాడాలి హై బీమ్ లైట్లు అవసర మైతే మాత్రమే వాడాలి.అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్ 112 కు సమాచారం అందించాలి. ప్రజల ప్రాణాలు, ఆస్తి రక్షణకు ఏలూరు జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అప్ర మత్తంగా ఉందని,ప్రతి ఒక్కరు రహదారి భద్రతా నియమాలను పాటించి సురక్షితంగా ప్రయాణించాలని పెదపాడు ఎస్ఐ ఆర్ శ్రీనివాస్ తెలియ చేసినారు.

