NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిపై ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు చేయండి

1 min read

దళిత కానిస్టేబుల్ మహేష్ ను అవమానించడం బాధాకరం

కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసిన దళిత జేఏసీ నాయకులు

కర్నూలు, న్యూస్​ నేడు:  మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని కర్నూల్లో దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు. కర్నూలు నగరంలోని కలెక్టరేట్ ఎదుట ఉన్న గాంధీ విగ్రహం వద్ద వారు ధర్నా చేశారు. దళిత పోలీస్ కానిస్టేబుల్ పై తప్పుడు ఆరోపణలు చేయడం ఎంతో బాధాకరమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం దళిత జేఏసీ నాయకులు మాట్లాడుతూ శ్రీరామ్ నగర్ కు చెందిన యువకుడి ఆత్మహత్య విషయంలో పరామర్శకు వెళ్లిన ఎస్వీ మోహన్ రెడ్డి త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహేష్ అనే కానిస్టేబుల్ పై అసత్య ఆరోపణలు చేశారని చెప్పారు. కానిస్టేబుల్ మహేష్ ను అవమానించి, దూషించి మనస్థాపానికి గురిచేశారని మండిపడ్డారు. దళిత కానిస్టేబుల్ విధులకు ఆటంకం కలిగించిన ఎస్వీ మోహన్ రెడ్డిపై తక్షణమే ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ దళిత జేఏసీ నాయకుడు అంబారి చంద్రశేఖర్.. త్రీటౌన్ సీఐ శేషయ్యకు వినతిపత్రం సమర్పించారు. ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జూటూరు రవి కుమార్, గున్నా మార్క్, క్రాంతి కుమార్, సుంకన్న, పామన్న, ప్రభాకర్, ఏసు, మోహన్, ప్రవీణ్, సునీల్, ఆనంద్, ప్రవీణ్ కుమార్, ఈశ్వర్, శివ, మణి ప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *