NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రిడ్జ్ స్కూల్ విద్యార్థిని ఆల్ ఇండియా ఎన్​సిసి ట్రెక్కింగ్ క్యాంప్‌కు ఎంపిక

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూలులోని రిడ్జ్ స్కూల్‌కు చెందిన 9వ తరగతి విద్యార్థిని బి. జ్యోత్స్న ప్రతిష్టాత్మకమైన ఆల్ ఇండియా  ఎన్​సిసి ట్రెక్కింగ్ ఎక్స్‌పెడిషన్ 2026–27కు ఎంపిక కావడం గర్వకారణం.ఈ ట్రెక్కింగ్ క్యాంప్ 2026 మే 6 నుండి 13 వరకు ఊటీలో నిర్వహించబడుతుంది. దేశవ్యాప్తంగా ఎంపికైన ఎన్‌సీసీ కేడెట్లలో భాగంగా జ్యోత్స్న ఎంపిక కావడం ఆమె కృషి, క్రమశిక్షణ మరియు ధైర్యసాహసాలకు నిదర్శనం.ఈ సందర్భంగా రిడ్జ్ స్కూల్ సీఈఓ గోపీనాథ్ , కో-సీఈఓ సౌమ్య గోపీనాథ్ , ప్రిన్సిపాల్ రాజ్‌కమల్ మ్యాథ్యూస్  మరియు డీన్ పి.కె. రాజేంద్రన్  జ్యోత్స్నను అభినందిస్తూ, ఆమె భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అలాగే, ఈ విజయానికి మార్గదర్శకత్వం వహించిన థర్డ్ ఆఫీసర్ & అసోసియేట్ ఎన్‌సీసీ ఆఫీసర్ (ANO) పల్లా హేమదుర్గ ని కూడా ప్రత్యేకంగా అభినందించారు.

About Author