మినీ జాబ్ మేళలో 27 మందికి ఉద్యోగ అవకాశాలు
1 min read
కర్నూలు,న్యూస్ నేడు: జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో నేడు 05.05.2026 మినీ జాబ్ మేళ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అపోలో ఫర్మిసీ కాంపెని యందు ఉద్యోగ ఇంటర్వ్యూలు నిర్వహించటం జరిగినది. ఇందులో 61 మంది నిరుద్యోగులు హాజరైయ్యారు. అందులో 27 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగినదని జిల్లా ఉపాధి కల్పనా అధికారిణి శ్రీమతి పి. దీప్తి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ యువతి ,యువకులు మరియు కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.


