అభ్యుదయానికి ఆదర్శానికి నిదర్శనమే రామాయణం
1 min read
శ్రీనివాస రామానుజ దాసు.
కర్నూలు , న్యూస్ నేడు: అభ్యుదయానికి ఆదర్శానికి నిదర్శనమే శ్రీమద్రామాయణమని, మానవీయ విలువలకు పట్టంకట్టిన శ్రీరాముడికంటే ఆదర్శమూర్తి ఈ భూమిపై మరొకరెవరూ కనిపించరని గుంటూరు జిల్లా, నంబూరు ఆశ్రమం పౌరాణికులు, మధుర వాచస్పతి శ్రీనివాస రామానుజదాసు అన్నారు. కర్నూలు నగరంలోని శ్రీ భరతమాత ఆలయంనందు ఏడురోజులుగా జరుగుతున్న సుందరకాండ ప్రవచన సప్తాహం అత్యంత భక్తిశ్రద్దలతో ముగిసింది.
ప్రవచన సుధానిధి పురష్కారంతో ఘన సన్మానం
ప్రవచనకర్తశ్రీనివాస రామానుజదాసుకు భరతమాత సేవాసమితితోపాటు వివిధ ధార్మిక సంస్థల ప్రతినిధుల సమక్షంలో జ్ఞాపిక, దుశ్శాలువ, పూలమాలతోపాటు నగదు అందించి ఘనంగా సత్కరించారు. డాక్టర్ తొగట సురేశ్ బాబు రచించిన పద్యరత్నాలకు విశ్రాంత తెలుగు పండితులు గరుడాద్రి వనజకుమారి పద్య కుసుమాంజలి సమర్పించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత విష్ణుసహస్రనామ సాంస్కృతిక సమాఖ్య ఉపాధ్యక్షులు మల్లెల పెద్ద పుల్లారెడ్డి, విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర విశేష సంపర్క ప్రముఖ్ తూముకుంట ప్రతాప్ రెడ్డి, ఆంద్రప్రదేశ్ శ్రీ గోదావిష్ణుసహస్రనామ పరివార్ వ్యవస్థాపక అద్యక్షులు మారం నాగరాజ గుప్తా, కె. వి. సుబ్బారెడ్డి విద్యాసంస్థల అధినేత డాక్టర్ కె. వి. సుబ్బారెడ్డి, భరతమాత సేవా సమితి కార్యవర్గ సభ్యులు మరియు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వై.శివశంకర్ రెడ్డి, చంద్రారెడ్డి, నారాయణరెడ్డి, లావణ్య, శకుంతల, పద్మావతి, కాత్యాయనీ, శ్రీలక్ష్మి, వసుంధరమ్మ, ప్రమీల, రత్నమ్మ, వ్యాఖ్యాత జి. బలరామాచార్య, శ్రీకూర్మ క్షేత్ర అభివృద్ధి సమన్వయకర్త నరేశ్, తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లాశాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


