రైతులకు వ్యవసాయ యంత్రీకరణ పరికరాలపై అవగాహన సమావేశం
1 min read
రాయితీపై వ్యవసాయ పరికరాలకు దరఖాస్తులు ప్రారంభం
ఎస్సీ, ఎస్టీ, చిన్న రైతులకు 50 శాతం సబ్సిడీ
మే 19 వరకు ఆన్లైన్లో దరఖాస్తులకు అవకాశం
జాయింట్ కలెక్టర్ సమక్షంలో లాటరీ ద్వారా లబ్ధిదారుల ఎంపిక
హోళగుంద న్యూస్ నేడు: హోళగుంద మండలంలోని కూటమి పార్టీ నాయకులు మరియు రైతులకు మండల వ్యవసాయ అధికారి శ్రీ ఆనంద్ లోకదళ్ వారి ఆధ్వర్యంలో రాయితీపై వ్యవసాయ యంత్రీకరణ పరికరాల పంపిణీ మరియు దాని విధి విధానాలపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకాలపై పూర్తి వివరాలు తెలియజేశారు.మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో యంత్రీకరణ వల్ల రైతులకు శ్రమ, సమయం, ఖర్చులు తగ్గి అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. రైతులు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను వినియోగించుకొని ఆధునిక వ్యవసాయ పరికరాలను పొందాలని సూచించారు.
నిబంధనలు మరియు అర్హతలు:
ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులు మరియు మహిళలకు యంత్రాల యూనిట్ ధరపై 50 శాతం రాయితీ, ఇతర రైతులకు 40 శాతం రాయితీ వర్తిస్తుంది.
భూమి కలిగి ఉన్న రైతులు మరియు ROFR రైతులు అర్హులు.
గత మూడు సంవత్సరాలలో కనీసం మూడు పంటల సీజన్లలో e-Panta అప్లికేషన్లో నమోదు చేసిన CCRC రైతులు అర్హులు.
గత సంవత్సరం (2024-25)లో సబ్సిడీ పొందిన లబ్ధిదారులు ఈ పథకానికి అర్హులు కారు.
కుటుంబంలో ఒక సభ్యుడు మాత్రమే ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం:
రాయితీపై వ్యవసాయ పరికరాల కోసం రైతులు తమ పరిధిలోని రైతు సేవా కేంద్రాలు లేదా మండల వ్యవసాయ అధికారి కార్యాలయాల్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
మే 5వ తేదీ నుండి మే 19వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తులు స్వీకరించబడతాయి.
లాటరీ ప్రక్రియ:
మే 23 నుండి 25 వరకు ఆన్లైన్ లాటరీ ప్రక్రియను జాయింట్ కలెక్టర్ సమక్షంలో నిర్వహించి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఆమోదంతో లబ్ధిదారుల జాబితా విడుదల చేయబడుతుంది.ఎంపికైన లబ్ధిదారులకు జాయింట్ కలెక్టర్ ద్వారా మంజూరు పత్రాలు జారీ చేయబడతాయి. అదేవిధంగా ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందించబడుతుంది.ఎంపికైన రైతులు 15 రోజులలోపు ఆర్ఎస్కే సిబ్బంది ద్వారా లేదా ఏఓ కార్యాలయం ద్వారా ఆన్లైన్లో సబ్సిడీ మినహా మిగిలిన మొత్తాన్ని డీలర్‌కు చెల్లించాల్సి ఉంటుంది.ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు, మండల కన్వీనర్ తిప్పయ్య టిడిపి మండల కార్యదర్శి ఈ బిజి గోవింద గౌడ్ , గవి సిద్ధప్ప, బసవరాజు రైతులు, వ్యవసాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

