వి.ప్రభాకరం మృతి ఉద్యోగ, కార్మిక ఉద్యమాలకు తీరని లోటు
1 min read
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్
సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: యూకో బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్ మాజీ రాష్ట్ర నాయకులు, ఏఐబిఈఏ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మాజీ నాయకులు వి.ప్రభాకరం ఈ రోజు ఉదయం అనారోగ్య సమస్యలతో సత్రంపాడులోని స్వగృహం నందు మృతిచెందారు.సమాచారం తెలిసిన వెంటనే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్, సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య,ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే,ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు కొంపల్లి కృష్ణమాచార్యులు, సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్, ఏరియా కార్యవర్గ సభ్యురాలు మావూరి విజయ భౌతిక కాయాన్ని సందర్శించి పూలదండలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం డేగా ప్రభాకర్ మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ వి. ప్రభాకరం యూకో బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకునిగా నిబద్ధతతో పనిచేసేవారని కొనియాడారు. నిరంతరం బ్యాంకు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం జరిగే ఉద్యమాలలో చురుగ్గా పాల్గొనే వాడని ఆయన మృతి బ్యాంకు ఉద్యోగులకు,కార్మిక సంఘానికి తీరని లోటని పేర్కొన్నారు ఆయన మృతికి సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

