NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అక్షిత చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రైతులకు తైవాన్ స్ప్రేయర్ పంపుల పంపిణీ

1 min read

హోళగుంద న్యూస్ నేడు: హొళగుంద మండలం లింగంపల్లి గ్రామంలో  అక్షిత చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో రైతులకు 50 శాతం సబ్సిడీతో తైవాన్ స్ప్రేయర్ మందుల పిచికారి పంపులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ఆలూరు తాలూకా టీడీపీ ఇంచార్జ్ శ్రీమతి వైకుంఠం జ్యోతి  ఆదేశాల మేరకు నిర్వహించబడింది.గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు హనుమంతరాయుడు, శేషగిరి, మూకన్న, లింగప్ప, కే గాదిలింగప్ప, టిడిపి యువ నాయకులు కురువ భీమన్న తదితరుల ఆధ్వర్యంలో రైతులకు ఈ పంపులను అందజేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులకు ఊరట కల్పించే దిశగా వ్యవసాయ పనిముట్లను అందించేందుకు కృషి చేస్తోందని తెలిపారు. ముఖ్యంగా ఆలూరు తాలూకా టిడిపి ఇంచార్జ్ వర్యులు  వైకుంఠం జ్యోతి రైతుల అభ్యున్నతికి నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు.రాబోయే రోజుల్లో కూడా జ్యోతి   పిలుపుతో ప్రజాసేవలో ముందుండి పనిచేస్తామని నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు, టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *