NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి పక్షోత్సవాల ముగింపు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కౌన్సిల్ ఆఫ్  ఇండియా,  లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్,నైస్ యూత్ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ల సంయుక్త ఆధ్వర్యంలో రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి పక్షోత్సవాల ముగింపు కార్యక్రమం  లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ అధ్యక్షతన  కేంద్ర గ్రంధాలయ సమావేశ భవనం లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ శ్రీ తుగ్గలి నాగేంద్ర మాట్లాడుతూ గ్రంధాలయాలు సాహిత్య పోషణకు నిలయాలని, గ్రంథాలయ సంస్థల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. గ్రంథాలయాల ద్వారా అనేకమంది నైపుణ్య సామర్థ్యాన్ని పెంపొందించుకొని ఉన్నతమైన ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారన్నారు.సమ్మర్ క్యాంపు నిర్వహణ ద్వారా చిన్నారులకు వివిధ నైపుణ్య శిక్షణలతో పాటు వినోద కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఆధునిక సాంకేతిక తో కూడిన డిజిటల్ లైబ్రరీని యువతీ యువకులకు అందుబాటులో ఉంచుతున్నామని, గ్రంథాలయాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకారాన్ని అందించాలన్నారు.కె.వి సుబ్బారెడ్డి విద్యాసంస్థల అధినేత డాక్టర్ కే.వీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని,సాహిత్య అభివృద్ధి కార్యక్రమాలకు గ్రంథాలయాల ద్వారా ఇంకా ఉదృతంగా చేపట్టాలన్నారు.జె.ఎస్.ఆర్.కె శర్మ మాట్లాడుతూ తెలుగు భాషాభివృద్ధికై ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ, లయన్స్  క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ప్రతినిధి లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని పురస్కరించుకొని  పక్షోత్సవల్లో భాగంగా సాహితీ రంగంలో సేవలందించిన వారికి రవీంద్రనాథ్ ఠాగూర్ నేషనల్ ఎక్సలెన్సీ అవార్డు, రవీంద్రనాథ్ ఠాగూర్ ఎడ్యుకేషన్ సర్వీస్ అవార్డ్, రవీంద్రనాథ్ ఠాగూర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు, రవీంద్రనాథ్ ఠాగూర్ లిటరరీ ఎక్సలెన్సీ అవార్డు, రవీంద్రనాథ్ ఠాగూర్ యూత్  ఇన్స్పిరేషన్ అవార్డ్, రవీంద్రనాథ్ ఠాగూర్ మెమోరియల్ ఎక్సలెన్సీ అవార్డు  లకు 70 మందికి పైగా  దరఖాస్తు చేసుకోగా 12 మందిని  మొదటి దశలో ఎంపిక చేసామన్నారు.  అవార్డులకు ఎంపిక అయిన డాక్టర్ కే.స్వయంప్రభ, బి.వి స్వరూప్ సిన్హా, షఫీ ఉల్లా, పరవస్తు లక్ష్మీ సుశీల రాణి, అను గోలు సంజీవరాయుడు, పి.జ్యోతి,ఎం.కాజా బేగ్, డాక్టర్ శాంతి పవార్,యాగంటి ఈశ్వరప్ప, మట్టి రవీందర్, షేక్ దరియా వలి, మస్తాన్ ఖాన్  లను ఘనంగా అవార్డులతో సత్కరించారు.అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ,లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్  మెల్విన్ జోన్స్ ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖన పోటీల విజేతలకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర సమక్షంలో బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమానికి డాక్టర్ హరికిషన్ వ్యాఖ్యాతగా  వ్యవహరించారు. కార్యక్రమంలో  గ్రంథాలయ సంస్థ ఉప కార్యదర్శి పెద్దక్క, స్పెషల్ పోలీస్ డిఎస్పి మహబూబ్ బాషా,ఆర్.ఆర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ రాహుల్,విశ్వభారతి వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ రమేష్,ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మురారి శంకరప్ప,తిరుపతి సాయి నైస్ స్వచ్ఛంద సేవాసంస్థ కార్యదర్శి రాయపాటి నాగలక్ష్మి, యాగంటిఈశ్వరప్ప, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *