మోసం చేసిన కేసులో వ్యక్తి అరెస్ట్..రిమాండ్
1 min read
కార్ నగదు సీజ్:ఎస్ఐ ఓబులేష్..
మిడుతూరు(నందికొట్కూరు) న్యూస్ నేడు: ప్రజలను మోసం(చీటింగ్)చేసిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు మిడుతూరు ఎస్సై హెచ్ ఓబులేష్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాలు మేరకు నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రానికి చెందిన లొద్దిపల్లె శివ కుమార్ అనే వ్యక్తి ఒక లక్ష రూపాయలకు అధికంగా 40 వేల రూ.లు మీకు వడ్డీ ఇస్తానని చెప్పి ప్రజలను నమ్మించి వారి వద్ద నుండి మొత్తం 25 లక్షల రూపాయలు తీసుకున్నట్లు బాధితుడు వాడాల గ్రామానికి చెందిన దిలీప్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని మిడుతూరులో బ్రహ్మంగారి మఠం దగ్గర శివకుమార్ ను అరెస్ట్ చేసి అతనికి వద్ద నున్న (టియువి ఏపి 07 సివై 4298)అను నంబర్ గల కార్ ను మరియు అతని వద్ద ఉన్న 2 లక్షల 90 వేల రూ.లు సీజ్ చేసి నందికొట్కూరు కోర్టులో హాజరు పరచగా జడ్జి మే 29 వరకు రిమాండ్ విధించినట్లు ఎస్సై తెలిపారు.బాధితులు దిలీప్ కుమార్ కు 15 లక్షలు, శివారెడ్డికి 7 లక్షలు, ఆంజనేయులుకు 3 లక్షలు ఇచ్చినట్లు బాధితులు తెలిపారని ఎస్ఐ తెలిపారు. అదే విధంగా అధిక వడ్డీకి ఆశపడి డబ్బులు ఎవరికి కూడా ఇవ్వవద్దని అలాంటి మాటలను నమ్మవద్దని ఎస్ఐ సూచించారు.ఈ కార్యక్రమంలో వీఆర్వో వెంకటయ్య,కానిస్టేబుల్ రేణు ప్రసాద్,వీఆర్ఏ కొండల్ తదితరులు పాల్గొన్నారు.

