జన గణన లో పురోగతి తీసుకొని రావాలి
1 min read
జలధార-జలహారతి ఉన్న పనులను వేగవంతంగా పూర్తిచేయాలి
ఉపాధి హామీ శ్రామికులకు పనులు కల్పించడంలో పురోగతి తీసుకొని రావాలి
ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తిచేయాలి
జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు, న్యూస్ నేడు: జన గణన లో పురోగతి తీసుకొని వచ్చి, రాష్ట్రంలో కర్నూలు జిల్లాను ఉన్నత స్థానంలో ఉంచాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి మున్సిపల్ కమిషనర్ లను, తహసిల్దార్ లను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుండి సెన్సస్, హౌసింగ్, బడి పిలుస్తుంది, జలధార – జలహారతి తదితర అంశాలపై జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జనగణన లో వెనుకబడి ఉన్నామని, వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్యూమరేటర్స్ ఫీల్డ్ కి వెళ్తున్నారా లేదా, టార్గెట్ ఎంత, ఎంత సాధించారు అన్న వివరాలను ఎప్పటికపుడు తీసుకోవాలని కలెక్టర్ మున్సిపల్ కమిషనర్, ఎంపిడిఓ లను ఆదేశించారు. ఎన్యూమరేటర్స్ ఏ విధంగా చేస్తున్నారని పరిశీలించడానికి క్షేత్ర స్థాయిలో తనిఖీ లు తప్పనిసరిగా చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. నిన్నటి రోజున 22 వేలు లక్ష్యం ఉంటే కేవలం 4 వేలే చేశారని కలెక్టర్ ఆదోని మున్సిపల్ కమిషనర్ ను ప్రశ్నించారు? ఈ విధంగా చేస్తే నిర్దేశించిన లక్ష్యాలను సాధించలేమన్నారు. ఉపాధి పనులు పనులు కల్పించడంలో పురోగతి తీసుకొని రావాలని కలెక్టర్ సంబంధిత మండలాల ఎంపిడిఓ లను ఆదేశించారు. ఉపాధి పనులు కల్పించకపోవడం ద్వారా ఎన్ఎమ్ఎమ్ఎస్ అటెండెన్స్ పురోగతి వెనుకబడి ఉందన్నారు. గ్రామాల్లో అబ్జర్వేషన్ వెల్స్ లో ఎక్కడ ఎంత వాటర్ ఉంది అనేది అబ్జర్వేషన్ చేసి, మనం ఈ వర్క్స్ అన్నీ చేసిన తర్వాత, మళ్ళీ వర్షాలు పడిన తర్వాత ఎంత వచ్చిందనే వివరాలు ఉండాలని సంబంధిత పనులు ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ తో చేయించాలని కలెక్టర్ పంచాయతీ రాజ్ ఎస్ఈ ని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ లో డిఆర్ఓ సి వెంకట నారాయణమ్మ, హౌసింగ్ పిడి చిరంజీవి, డ్వామా పిడి నరసింహ రెడ్డి, ఇరిగేషన్ ఎస్ఈ బాలచంద్రారెడ్డి, గ్రౌండ్ వాటర్ ఎస్ఈ, జిల్లా పరిషత్ సీఈఓ రమణ రెడ్డి, డిఈఓ సుధాకర్, సర్వ శిక్ష అభియాన్ పిఓ లోకరాజ్, జిల్లా సెన్సస్ ఇంచార్జి నోడల్ అధికారి దీపక్ భరద్వాజ్, తదితరులు పాల్గొన్నారు.

