NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్నూలు నియోజకవర్గంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై వైఎస్సార్సీపీ నిరసన

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షులు శ్రీ ఎస్వీ మోహన్ రెడ్డి  ఆదేశాల మేరకు, పెరిగిన పెట్రోల్ మరియు డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ కర్నూలులో రాష్ట్ర మహిళా విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీమతి ఎస్వీ విజయ మనోహరి  ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఎన్నికల ముందు నారా చంద్రబాబు నాయుడు , నారా లోకేష్  పెట్రోల్, డీజిల్ ధరలను పెంచబోమని, అవసరమైతే తగ్గిస్తామని ప్రజలకు హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత మాట తప్పి, రాష్ట్ర ప్రజలపై అదనపు భారం మోపుతున్నారని విమర్శించారు.దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధికంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఉండటం బాధాకరమని పేర్కొంటూ నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం మంత్రాలయం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించి, పెరిగిన ఇంధన ధరలను వెంటనే తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త శ్రీమతి బుట్టా రేణుక , నియోజకవర్గ నాయకులు, మహిళా నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Author