NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బాల్య వివాహాల నిర్మూలనకు జేఎం తండా లో ప్రారంభమైన మహా యజ్ఞం

1 min read

న్యూస్ నేడు, పత్తికొండ: బాలికల భవితకు అడ్డంకుగా నిలిచిన బాల్య వివాహాల నిర్మూలనకు మారుమూల గిరిజన తండాలో మహా ఉద్యమానికి బీజం పడింది. చిన్న వయసులోనే ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసి తమ బాధ్యత తీరిపోయిందని అనుకునే తల్లిదండ్రులకు ఈ మహా ఉద్యమంలో భాగస్వాములను చేసే దిశగా అడుగులు వేయిస్తున్న తీరు ఒక సాధారణ ఉపాధ్యాయిని సామాజిక స్పృహకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం జే ఎం తాండ గ్రామంలో టీచర్ గా పని చేస్తూ బడి పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసింది. అలాగే సమాజంలో ఎన్నో ఏళ్లుగా వేల్లోనుకొని పోయిన బాల్యవివాహాల నిర్మూలనకు ఆమె తన వంతు కృషి ఎంతో ప్రశంసనీయం. సమాజం పట్ల ఒక అంకితభావం గల ఉపాధ్యాయురాలు , జేఎం తండా ప్రాథమిక పాఠశాల ‘షైనింగ్ టీచర్’ శ్రీమతి ఎం. కళ్యాణి కుమారి ఒక శక్తివంతమైన సామాజిక విప్లవానికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో బుధవారం పత్తికొండ మండలం పరిధిలోని గిరిజన గ్రామం జేఎం తండాలో ఒక చారిత్రాత్మక మైలురాయి నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా బాల్య వివాహాల సమస్యపై తీవ్ర చర్చ జరుగుతున్న తరుణంలో, ఈ మారుమూల గ్రామం అందరికీ ఆదర్శంగా నిలిచే ఒక అద్భుతమైన ఉదాహరణను చాటిచెప్పింది. వాళ్ల వివాహాల నిర్మూలన కోసం గ్రామ ప్రజలంతాఏకతాటిపైకి వచ్చి చారిత్రాత్మక తీర్మానం – ప్రతిజ్ఞ నిర్వహించారు. సైనింగ్ టీచర్ కళ్యాణి మేడం గ్రామ ప్రజలతో పాటు అధికారులను సైతం బాల్య వివాహాల నిర్మూలన ఉద్యమంలో భాగస్వాములను చేసింది. ఈ సందర్భంగా గ్రామంలో  గ్రామ పెద్దలు, స్థానిక అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో ఒక కీలకమైన సామాజిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో షైనింగ్ టీచర్ శ్రీమతి కళ్యాణి కుమారి నేరుగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *