NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తాగునీటి సమస్యపై సచివాలయం ముట్టడీ

1 min read

తాళం వేసిన తెర్నేకల్ గ్రామస్తులు…..

న్యూస్ నేడు, పత్తికొండ:  దేవనకొండ మండలం తెర్నేకల్ గ్రామంలో తీవ్రంగా తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న ఆయా కాలనీవాసులు సిపిఎం ఆధ్వర్యంలో  బుధవారం నాడు సచివాలయం చేరుకొని అక్కడ సిబ్బంది ఎవరు లేకపోవడంతో ఆగ్రహంతో సచివాలయనికి  తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలోని కొండగిరి మాధవ స్వామి గుడి దగ్గర నుండి జమ్మన్ కట్ట వరకు తేర్ బజారు, రామం మా పేట, ఎరుకుల వీధి,, కొండపేట తీవ్రంగా నీటి ఎద్దడి తాగునీటి సమస్య ఉన్న అధికారులకు పదేపదే విజ్ఞప్తి చేస్తున్న చాలా నిర్లక్ష్యం వసన్నారని ఈ  ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తద. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు బజారి, మహబూబ్ బాషా, కె.పి రాముడు లు మాట్లాడుతూ, తీవ్రమైన ఎండాకాలంలో తాగునీటి సమస్య ఉందని అధికారులకు పదేపదే విజ్ఞప్తి చేస్తున్న నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని,ఇది బాధాకరమని గుక్కెడు నీళ్ల కోసం సుదూర ప్రాంతాలకు తల్లి పిల్ల వెళ్లి తెచ్చుకోవాల్సిన పని పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు నాలుగు వార్డు ల ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతుంటే అధికారులు చోద్యం చూస్తున్నారు అని విమర్శించారు సచివాలయం కు అడుగుదామని వెళితే తాళం వేసినా సచివాలయాలే కనపడుతుందని సచివాలయం సిబ్బంది ఇష్టను సారంగా వస్తున్నారని ప్రజలకు జవాబుదారీగా ఉండవలసిన సిబ్బంది చాలా నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు వారూ పేర్కొన్నారు. విధులకు హాజరుకాకుండా వ్యవహరిస్తున్న వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పదే పదే తాగునీటి సమస్య వస్తే  ఎంపీడీవో కార్యాలయం ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దొడ్డప్ప, సుధాకర్, రవీంద్ర, శివ ఈశ్వరమ్మ లింగమ్మ శివలక్ష్మి కౌలమ్మ లక్ష తదితరులు పాల్గొన్నారు.

About Author