గ్రామ ప్రజలకు ఆరోగ్య పరిరక్షణకు వాటర్ ట్యాంక్ శుభ్రం
1 min read
హోళగుంద న్యూస్ నేడు: హోలగుంద మండలం సులువాయి గ్రామంలోని ప్రజలకు స్వచ్ఛమైన మరియు సురక్షితమైన తాగనీరు అందించాలని ఉద్దేశంతో ఈరోజు మన గ్రామంలోని వాటర్ ట్యాంక్ ను పంచాయతీ సెక్రెటరీ రామాంజనేయులు సార్ ఆధ్వరంలో ప్రత్యేకంగా శుభ్రపరిచే కార్యక్రమం నిర్వహించడం జరిగిందిగ్రామ ప్రజలు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ట్యాంక్ లోని మలినాలు చెత్తను పూర్తిగా తొలగించి పరిశుభ్రత చర్యలు చేపట్టారుఅదేవిధంగా ట్యాంకు శానిటైజేషన్ నిర్వహించి నీటి నాణ్యత మరుగుపడేలా చర్యలు తీసుకున్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది వాటర్ సప్లై సిబ్బంది పాల్గొని పనులను విజయవంతంగా పూర్తిగా చేశారుగ్రామంలోని తాగునీటి సమస్యను తల ఎత్తకుండా ముందస్తు చర్యలుగా ఇలాంటి పరిశుభ్రత కార్యక్రమాలు తరచూ నిర్వహిస్తామని పంచాయతీ అధికారులు తెలిపారు గ్రామ ప్రజలు కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ పంచాయతీకి సహకరించాలని కోరారు.

