ఘనంగా జన్మదిన వేడుకలు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలి ఖాన్, 98వ బూత్ ఇంచార్జ్ రంగ, 191వ బూత్ ఇంచార్జ్ షేక్ అబ్బాస్, 234వ బూత్ ఇంచార్జ్ షకీలా భాను, 247వ బూత్ ఇంచార్జి సికిందర్, 258వ బూత్ ఇంచార్జ్ నాయుడు ల జన్మదిన వేడుకలు రాష్ట్ర పరిశ్రమలు & వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రివర్యులు టీ.జీ భరత్ కార్యాలయం మౌర్య ఇన్, కర్నూలులో ఘనంగా నిర్వహించబడినవి.కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ సమక్షంలో నాయకులు కేక్ కట్ చేసి ఆనందోత్సాహాల మధ్య జన్మదిన వేడుకలను జరుపుకున్నారు.ఈ సందర్భంగా శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న నాయకులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు రానున్న రోజులలో మరెన్నో జన్మదిన వేడుకలను జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కర్నూలు నగర పార్టీ అధ్యక్షులు కొరకంచి రవికుమార్, రామాంజనేయులు, శేషుయాదవ్, తిమ్మప్ప మొదలగు వారు పాల్గొన్నారు.

