NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నేరణికి తాండలో గిరిజన సమస్యలపై ప్రత్యేక దృష్టి – డీటీడబ్ల్యుఓ సురేష్ హామీ

1 min read

త్రాగునీరు, విద్య, సంక్షేమ పథకాల అమలుకు కట్టుబడి ఉన్నాం – జిల్లా గిరిజన సంక్షేమ అధికారి సురేష్

గిరిజనుల సమస్యలు వెంటనే పరిష్కరిస్తాం – ఎంపీడీఓ

హోళగుందన్యూస్ నేడు: నేరణికి తాండ గ్రామంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి (డీటీడబ్ల్యుఓ) సురేష్ పర్యటనహొళగుంద మండలం నేరణికి తాండ గ్రామాన్ని జిల్లా గిరిజన సంక్షేమ అధికారి (డీటీడబ్ల్యుఓ) సురేష్ సందర్శించారు. గ్రామంలోని గిరిజన ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, ముఖ్యంగా త్రాగునీటి సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, విద్యాభివృద్ధి తదితర అంశాలపై గ్రామస్తులతో చర్చించారు.ఈ సందర్భంగా డీటీడబ్ల్యుఓ సురేష్ మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. గ్రామంలో ఉన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించి, సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా విద్యాభివృద్ధి మరియు మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు.అలాగే మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) మాట్లాడుతూ గిరిజనులకు సంబంధించిన సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే స్పందించి పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో విఠల్ నాయక్, శంకర్ నాయక్, రాజేష్ నాయక్, లోక్య నాయక్ తదితర గ్రామ పెద్దలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *