పరిపూర్ణ వ్యక్తిత్వ నిర్మాణం భగవద్గీతతోనే సాధ్యం
1 min read
శ్రీ నిత్యతృప్తదాస్ స్వామీజీ -ఇస్కాన్ ధర్మ ప్రచారకులు
కర్నూలు, న్యూస్ నేడు: భగవద్గీత మనిషి జీవితాన్ని కేవలం ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా, మానసికంగా, నైతికంగా, సామాజికంగా, కార్యదీక్షతో కూడిన సంపూర్ణ జీవన విధానంగా తీర్చిదిద్దే మహాగ్రంథమని ఇస్కాన్ ధర్మ ప్రచారకులు శ్రీ నిత్యతృప్తదాస్ స్వామి అన్నారు. సంజామల మండలం, పేరుసోముల గ్రామంలో వెలసిన శ్రీ విష్ణుకంటి క్షేత్రం నందు శ్రీ రామ్మోహన్ స్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భగవద్గీత ప్రవచన కార్యక్రమాలలో భాగంగా మొదటిరోజు గీత మనిషిలో ధైర్యాన్ని, కర్తవ్యనిష్ఠను, ఆత్మవిశ్వాసాన్ని, సమత్వబుద్ధిని, నియమశీలతను, సేవాభావాన్ని పెంపొందిస్తుందని అన్నారు. భగవద్గీత కేవలం పూజాగ్రంథం కాదని, అది మానవ నిర్మాణ శాస్త్రం, జీవన మార్గదర్శి, పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి అంతకు మించిన గ్రంథం మరొకటి లేదని అన్నారు. కార్యక్రమానికి ముందు పూజ్య శ్రీ శ్రీ కంబగిరి స్వామీజీ ఆశీః ప్రసంగం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


