NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పర్యావరణ పరిరక్షణ పై చిత్రాలేఖన  పోటీల ప్రారంభం

1 min read

కర్పూలు, న్యూస్ ​నేడు: ప్రపంచ పర్యావారణ దినోత్సవాన్ని  పురస్కరించుకొని లయన్స్ క్లబ్ అఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్, పొల్యూషన్ కంట్రోల్ రీజినల్ కార్యాలయం,జిల్లా న్యాయసేవాధికార సంస్థ,నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కౌన్సిల్ అఫ్ ఇండియా నైస్ యూత్ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ సంస్థల, భారత్ వికాస్ పరిషత్ ల సంయుక్త ఆధ్వర్యంలో ‘ పర్యావారణ పరిరక్షణ పై  అంశంపై సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ విభాగాలలో  నైస్ కంప్యూటర్స్, పొల్యూషన్ బోర్డు కార్యాలయంలో జరిగిన  చిత్రాలేఖన  పోటీల ప్రారంభ కార్యక్రమంలో  లయన్స్ జిల్లా గవర్నర్ అడ్వైసర్ లయన్స్ క్లబ్ అఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ప్రతినిధి,నైస్ యూత్ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ సంస్థ అధ్యక్షులు లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ అడవిలో చెట్లను కొట్టేయడం, వాతావరణ కాలుష్యం, పారిశ్రామిక మరియు ప్లాస్టిక్  వ్యర్థ్యాలు వాతావరణ మార్పులకు ప్రధాన కారణం అన్నారు.లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ఉపాధ్యక్షులు జిల్లా ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మురారి శంకరప్ప మాట్లాడుతూ విపరీతంగా పెరిగిపోయిన వాహనాల నుండి వెలువడే పొగ గ్లోబల్ వార్మింగ్ కు దారితీస్తుందన్నారు.  భారత్ వికాస్ పరిషత్ ప్రతినిధి బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ వర్షపాతం లోపించడం, వరదలు, తీవ్ర ఎండలు లాంటి ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్నాయని వాతావరణాన్ని రక్షించుకోవాలంటే సహజ వనరులను కాపాడుకోవాలన్నారు.లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్  వైస్ ప్రెసిడెంట్ కె. డి. జె బాబు మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చు అన్నారు.  మాట్లాడుతూ ప్రతి వ్యక్తి పర్యావరణ పరిరక్షణలో తన వంతు బాధ్యతను గుర్తించుకో్వాలని, పర్యా్వరణాన్ని పరిరక్షించుకోవాలని, సౌర శక్తి వినియోగం పెరిగేలా అగాన కార్యక్రమాలు నిర్వహించుకోవాలన్నారు.

About Author